చైనాను వణికిస్తున్న కొత్త వేరియంట్ BQ.1 ఒమిక్రాన్, లక్షణాలు

చైనా, అమెరికా దేశాలను మరోసారి కొత్త వేరియంట్ BQ.1 ఒమిక్రాన్ వణికిస్తోంది. డ్రాగన్‌ కంట్రీలో ఒకే రోజు 31,454 కేసులు రికార్డయ్యాయి. దీనితో చైనా లాక్ డౌన్ విధిస్తోంది. ఈ వేరియంట్ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము.

webdunia

జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు కారటం, అలసట వంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

నేషనల్‌ హెల్త్‌ బ్యూరో గణాంకాల ప్రకారం చైనాలో ఒకే రోజు 31,454 కేసులు రికార్డయ్యాయి.

కోవిడ్ వేరియంట్ విజృంభణ నేపధ్యంలో పాక్షిక లాక్‌డౌన్‌, ట్రావెల్‌ ఆంక్షలు విధించేందుకు చైనా సన్నద్ధం.

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోగనిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకొని ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని హెచ్చరిలు.

భారత్‌లో కొవిడ్‌ ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నదని అధికారులు వెల్లడి.

గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 360 కొత్త కేసులు నమోదు

కరోనా నివారణకు ప్రజలందరూ చర్యలు కొనసాగించాలని సూచన