మకర సంక్రాంతికి ప్రత్యేకంగా ఏమి చేస్తారు?

మకర సంక్రాంతి జనవరి 15న గొప్ప పండుగ రాబోతుంది, ఈ రోజు శుభప్రదంగా చేసే కొన్ని పనులు గురించి తెలుసుకుందాము.

credit: Instagram and webdunia

భోగి మంటలు, భోగిపళ్లు

మకర సంక్రాంతికి ముందు భోగి మంటలు వేసి, చిన్నారులపై భోగిపళ్లు పోస్తారు.

పొంగలి నైవేద్యం

మరుసటి రోజు మకర సంక్రాంతికి కొత్తగా వచ్చిన ధాన్యంతో బెల్లం పొంగలి చేసి భగవంతుని నైవేద్యంగా పెడతారు

సంక్రాంతి గాలిపటాలు

ఆ మరుసటి రోజున గాలిపటాలను ఎగురవేస్తూ దానిని వేడుకగా జరుపుకుంటారు.

పశువులకు అలంకరణ

కనుమ రోజున గోవులను అలంకరించి వాటికి కడుపారా పచ్చి మేత తినిపించడం గొప్ప పుణ్యంగా భావిస్తారు.

సూర్య భగవానుడికి అర్ఘ్యం

మకర సంక్రాంతి సూర్యుని ఉత్తరాయణ పండుగ, కాబట్టి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారు.

విష్ణువు, లక్ష్మిదేవిలకు పూజ

ఈ రోజున శ్రీ హరి విష్ణువు, మాతా లక్ష్మిని పూజిస్తారు.

తీర్థయాత్ర లేదా దానం

తీర్థయాత్ర లేదా దేవాలయంలో దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.