రాఖీ కట్టేటప్పుడు చదవాల్సిన స్తోత్రం ఏమిటి?

సోదరీసోదరుల దృఢమైన అనుబంధమునకు గుర్తు రాఖీ పండుగ. ఈ ఏడాది 30 ఆగస్టు 2023 బుధవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 31 ఆగస్టు 2023 ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. కనుక 30న జరపుకోవచ్చంటున్నారు.

webdunia

సోదరి రాఖీ అనే పవిత్ర తోరాన్ని తన సోదరుడి మణికట్టుకు కట్టి అతడు సంతోష ఆనందాలతో అన్ని రంగాలలోను విజయం పొందాలని ఆకాంక్షిస్తుంది.

సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని వాగ్దానం చేస్తాడు.

రాఖీ రోజు ఉద‌యాన్నే త‌లార స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి రాఖీకి సిద్ధ‌ప‌డ‌తారు.

రాఖీని క‌ట్టేట‌ప్ప‌డు `యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల` అనే స్తోత్రాన్ని చ‌దువుతారు.

ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బ‌లిచక్ర‌వ‌ర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇత‌ణ్ని అన్ని కాలాల‌లోనూ విడ‌వ‌కుండా ఉండు అని దీని అర్థం.

ఆ త‌రువాత హార‌తిని ఇచ్చి, నుదుట‌ తిల‌కాన్ని దిద్దుతారు.

దీనికి ప్రతిగా సోద‌రులు త‌మ ప్రేమ‌కు గుర్తుగా వారికి చ‌క్క‌టి బ‌హుమ‌తుల‌ను అందిస్తారు.