01-11-2022 నుంచి 30-11-2022 వరకూ మీ రాశి ఫలితాలు

నవంబరు నెలలో ఆయా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వున్నాయో ప్రముఖ జ్యోతిష్యురాలు ప్రసూనా రామన్ తెలిపిన వివరాలు చూద్దాము.

webdunia

మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం

ఈ మాసం ప్రథమార్థం ఆశాజనకం. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి.

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు

గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు.

మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మీ సంకల్పం త్వరలో సిద్ధిస్తుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడులు అనుకూలించవు.

కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఈ మాసం శుభదాయకమే. వ్యవహార జయం, ప్రశాంతత పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు.

సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకోగల్గుతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది.

కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

గ్రహాల అనుకూలత బాగుంది. లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం.

తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పువస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు.

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట

ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఆదాయం ఫర్వాలేదపిస్తుంది. ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. ధన సమస్వలెదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు.

ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం

ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతవుతారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

వ్యవహారానుకూలత ఉంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు.

కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

అన్ని రంగాల వారికీ శుభదాయకమే. ఆదాయం బాగుంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి, వ్యాపకాలు సృష్టించుకుంటారు.

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

సంకల్పసిద్ధికి పట్టుదల ప్రధానం. అవకాశాలను వదులుకోవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండదు.