నేను కమిట్మెంట్ ఇచ్చే రకం కాదంటున్న కీర్తి సురేష్

సినిమా అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే రకం కాదని, అవసరమైతే ఉద్యోగం చేసుకుంటానని హీరోయిన్ కీర్తి సురేష్ అన్నారు. పైగా, చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమేనని ఆమె చెప్పారు.

credit: Instagram

క్యాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్ తాజాగా స్పందించారు.

చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం చూసే మహిళలకు వేధింపులు నిజమేనని చెప్పారు.

తన వరకు మాత్రం అలాంటి అనుభవం ఎదురు కాలేదన్నారు.

ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం సినిమాలు మానేసి ఉద్యోగం చేసుకుంటానని చెప్పారు.

అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదని స్పష్టం చేశారు.

కొందరు హీరోయిన్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిర్గతం చేశారన్నారు.

మన ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ఈ విషయంలో ముఖ్యమన్నారు.

మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నామనేదాన్ని బట్టి కమిట్మెంట్ అడుగుతారేమోనని కీర్తి సురేష్ అభిప్రాయపడ్డారు.