పద్మాసన స్థితిలోకి రావాలి.మోకాలు భాగాలు తప్పనిసరిగా నేలను తాకుతున్న స్థితిలో ఉండాలిమోచేతులను వెనుకకు తీసుకురావాలి.మీ వీపును నేలకు సమాంతరంగా ఉంచాలి.ఈ స్థితిలో మీ మోచేతులు మరియు చేతుల సాయాన్ని మీరు తీసుకోవచ్చు.మీ చేతులను తలవైపుగా వెనక్కు ఉంచాలి.ఇప్పుడు మీ అరచేతులు నేలకు సమాంతరంగా ఉంచాలి.మీ చేతులు భుజాలకు వ్యతిరేక దశలో ఉండాలి.మీ అరచేతులను, మోచేతులను కిందికి నొక్కి ఉంచాలి.మీ పొత్తి కడుపును, ఛాతీని ముందుకు లేపి ఉంచాలి.నడుము, వీపు, భుజాలు నేలకు తాకకుండా పైకి లేపాలి.మీ శరీరం ఇప్పుడు మీ చేతుల సాయంపై ఆధారపడి ఉండాలి.వెన్నుపూసను విల్లులాగా వంచాలి.మీ తల పైభాగం నేలకు తాకేలా ఉండాలి.మీ తొడల వెనుక భాగాలను పట్టి ఉంచండి.మీ పొత్తికడుపు మరియు రొమ్ముభాగాన్ని పైకి ఎత్తి ఉంచేందుకు మీ మోచేతులు ఒక కప్పీలాగా ఉపయోగపడాలి. బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు మూడూ ఎదురుగా ఉన్న కాలివేళ్ళను గట్టిగా పట్టి ఉంచడానికి గాను కొక్కీ రూపంలో ఉండాలి.కనీసం 10 సెకనుల పాటు ఈ స్థితిలోనే ఉండాలి.మీరు మామూలుగానూ, క్రమబద్ధంగాను శ్వాసను పీలుస్తుండాలి.