గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (14:04 IST)

పాటియాలా జైలులో సిద్ధూకు గుమస్తా గిరి - రోజుకు రూ.90 వేతనం

navjyoth singh siddhu
రాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా ఓ వ్యక్తిని కొట్టి చంపిన కేసులో భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీపీసీ మాజీ చీప్ నవజ్యోతి సింగ్‌కు సుప్రీంకోర్టు ఒక యేడాది జైలుశిక్షను విధించింది. 1998 నాటి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయన పాటియాలా కోర్టులో లొంగిపోవడంతో జైలుకు తరలించారు. ప్రస్తుతం సిద్ధూ తన పనులను తానే చేసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో జైలు అధికారులు సిద్ధూకు క్లర్క్ పని అప్పగించారు. చేయాల్సిన పనులపై మూడు నెలల పాటు శిక్షణ కూడా ఇస్తారు. ఆ తర్వాత సిద్ధూ స్వయంగా ఆ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. సుధీర్ఘంగా ఉండే కోర్టు తీర్పులను సంక్షిప్తీకరించడం, జైలు రికార్డులను సంకలనం చేయడాన్ని సిద్ధూ నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి సంబధించి శిక్షణ ఇవ్వనున్నారు. 
 
జైలు నిబంధనల మేరకు సిద్ధూకు తొలి మూడు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత రోజువారీ వేతనంగా రూ.40 నుంచి రూ.90 వరకు జైలు అధికారులు వేతనం చెల్లించనున్నారు. అయితే, హైప్రొఫైల్ ఖైదీ కావడంతో బరాక్ నుంచి క్లర్క్ పనులను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు గది నుంచి బయటకు రాకుండా ఉండేలా ఆయన సెల్‌కే అన్ని రికార్డులు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, సిద్ధూ ఉండే సెల్‌ సమీపంలో గట్టి భద్రతను కల్పించారు.