రాజమండ్రిలో రామ్ పోతినేనికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. గోదావరి జిల్లాలలో సంప్రదాయం ప్రతిబింబించేలా అరటి పళ్ళతో చేసిన భారీ దండతో వెల్కమ్ చెప్పారు. RAPO22 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్తే... ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇప్పటివరకు ఏ హీరోకి ఇటువంటి ఘన స్వాగతం రాజమండ్రిలో దక్కలేదు. అరటిపళ్ల దండ అందుకున్న మొదటి హీరో రామ్.
ఓ యువ డాక్టరమ్మ తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసింది. ఒక్కగానొక్క కుమార్తె తమకు దక్కదన్న కొండంత దుఃఖాన్ని దిగమింగుకుని, అవయవాలను దానం చేసి బిడ్డ కోరిక తీర్చారు ఆమె తల్లిదండ్రులు.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపులు మండల నంగివాండ్లపల్లికి చెందిన నంగి నందకుమార్ రెడ్డి, లోహితల కూతురు భూమికారెడ్డి (24). ఇటీవలే వైద్య విద్య పూర్తిచేసి హైదరాబాద్ ఎల్బీ నగరులోని కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తోంది.