1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

edappadi k palaniswamy
తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన అగ్ర హీరో విజయ్‌కు ఎన్డీయే కూటమి ఆహ్వానం పలికింది. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమితో కలిసి పోటీ చేయాలని కోరింది. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి స్నేహాస్తం అందించారు. ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీని ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. 
 
ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే కూటమిని ఓడించేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా, విజయ్ వచ్చిన కలుపుకుని పోతామన్నారు. శనివారం తమ పార్టీ ప్రచార లోగోను ఆయన ఆవిష్కరించారు. 
 
రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు సిద్ధంగా, దృఢ నిశ్చయంతో ఉన్నాయన్నారు. అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. డీఎంకే, బీజేపీతో ఎన్నటికీ పొత్తు ఉండదని ప్రటించిన విజయ్‌ను బీజేపీ ఉన్న ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించడం గమనార్హం. ప్రజా వ్యతిరేక డీఎంకే పార్టీని ఓడించానుకునే ప్రతిపక్షాలన్నింటినీ కూటమిలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎడప్పాడి ప్రకటించారు. 
 
కాగా, టీవీకే పార్టీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును ప్రకటించింది. దీనిపై ఎడప్పాడి స్పందిస్తూ, తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నికలకు వెళుతుందని, ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం తానేనని చెప్పారు.