0

వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?

గురువారం,ఫిబ్రవరి 20, 2020
0
1

పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?

సోమవారం,ఫిబ్రవరి 17, 2020
''అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...!" అన్నాడు సురేష్ "అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..!" షాకిచ్చే సమాధానం ఇచ్చాడు మహేష్.
1
2
అబ్బాయి: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..! అమ్మాయి: అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!
2
3

ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ

శనివారం,ఫిబ్రవరి 15, 2020
రాము: ఒరేయ్ గిరీ ఇన్ని సంవత్సరాలు అయింది. నా అప్పు ఎప్పుడు తీరుస్తావు. గిరి: అప్పుడే చెప్పాను కదరా.... రాము: ఏమనీ... గిరి: ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ.
3
4
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు "మరి ఆడవారు..?" అడిగాడు సుందర్ "ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
4
4
5

ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!

శుక్రవారం,ఫిబ్రవరి 7, 2020
"నేను ఆదివారం పుట్టాను.. తెలుసా?" చెప్పాడు బంటి "అబద్ధం చెప్పొద్దు.. ఆదివారం సెలవు కదరా?" అడిగాడు చంటి.
5
6
హోటల్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.. "ఏరా.. ఈ పూరీ భలే పొగింది చూడు.. ఎవరో బాగా పొగిడేవుంటారు..!" అన్నాడు రాజు "అవును రా.. బహుశా అది ఆడ పూరీ అయివుంటుందిరా.. అందుకే పొగడగానే బాగా పొంగిపోయింది..!" సెటైర్లు వేశాడు.
6
7

తలకాయ వుందా అని అడిగితే..?

సోమవారం,ఫిబ్రవరి 3, 2020
"తలకాయ వుందా.. అంటే ఓ వ్యక్తికి మాత్రం కోపం రాదు..!" అడిగాడు సుమంత్ "తలకాయ వుందా అడిగితే కోపం రాదా.. వాడెవడ్రా.. బాబూ..?" అడిగాడు విశాల్ ''మటన్ షాప్ అతను రా..!" బదులిచ్చాడు సుమంత్.
7
8
"హోటల్‌లో తిని బిల్లు కట్టలేదంటే ఏం చేస్తారు?" అడిగాడు రాము "హోటల్‌లో పని చేయాలని చెప్తారు..!" బదులిచ్చాడు సోము "మరి బ్యాంకులో లోను తీసుకుని కట్టకపోతే.. బ్యాంకులో ఉద్యోగం ఎందుకివ్వరు?" అని అడగటంతో.. సోము ఏమౌతాడు.. షాకయ్యాడు..!
8
8
9
''మొబైల్ ఫోన్ చేతిలో వుంటే గంట.. లేకపోతే రెండే నిమిషాల్లో ఆ పని చేయొచ్చు తెలుసా?" అన్నాడు రాజు "అవునా? ఏంటది..?" ఆత్రుతగా అడిగాడు వినోద్ "అదేం లేదు.. తినేటప్పుడు మన చేతిలో మొబైల్ వుంటే గంట సేపు తింటాం. అదే మన మొబైల్ వేరే వాళ్ళ చేతిలో వుంటే ...
9
10
శ్రీను : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా. ప్రసాద్ : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను.
10
11

సెలవు తీసుకోమని పంపాడు

బుధవారం,జనవరి 22, 2020
"మా మేనేజర్‌కి రాశి ఫలితాల మీద నమ్మకం ఎక్కువ!" "ఎలా చెప్పగలవు?" "రేపటి రాశి ప్రకారం నా ఆరోగ్యం దెబ్బతింటుందన్నా. అంతే శెలవు తీసుకోమని పంపేశాడు!"
11
12
"జూలో పనిచేసే సుందరం భార్య పక్కింటావిడతో ఇలా అంది" "మా వారు సింహం బోనులోకి చాలా ధైర్యంగా వెళ్ళిరాగలరు..!" "వామ్మో.. ఆయనకు సింహం అంటే భయం లేదా..?" "ఎందుకుండదు.. ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు..!"
12
13
క్లాసు ప్రారంభమైన తర్వాత రాజు వేగంగా వస్తూ... మే ఐ కమిన్ మిస్ అన్నాడు. దాంతో టీచర్... ఏరా రాజు, లేట్ గా ఎందుకు వచ్చావ్ అని అడిగింది. రాజు: మీరేకదా టీచర్...! లేట్‌గా వచ్చిన వాళ్ళని ఇంటికి పంపించేస్తానన్నారు అన్నాడు ఠక్కున.
13
14
"నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్‌ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!" అన్నాడో బౌలర్ "మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! అడిగాడు విలేకరి "ఏవో ఫోర్‌లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్
14
15
రాజు: అతనేంటి పేరడిగితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవైపు చూపించి వెళ్ళి పోతున్నాడు? సోము: ఓ.... అతనా! అతని పేరు ఏడుకొండలు. సోమవారం రోజున ఆయన మౌనవ్రతం లెండి, మాట్లాడడు.
15
16
ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా ప్రియా, ప్రేమగా అడిగాడు రవి. వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి ఉంది కదా, తెలివిగా బదులిచ్చింది రాధిక. 2. ఒకటవ నెంబరు ఫ్లాట్‌ఫాం పైకి రైలు వస్తోంది అన్నాడు ఎనౌన్సర్. అయ్య బాబోయ్ అంటూ రైలు పట్టాల పైకి దూకాడు ...
16
17

ఇది నో పార్కింగ్ జోన్

మంగళవారం,డిశెంబరు 24, 2019
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి. "ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు. "మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి. "వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
17
18
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి. శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి! శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.
18
19

తాగినప్పుడు అందంగా వుంటావు డియర్

మంగళవారం,డిశెంబరు 17, 2019
"తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి" అన్నాడు రాణితో శ్రీను. "అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే" అన్నది రాణి. "నువ్వు కాదు డార్లింగ్... నేను తాగినపుడు" చెప్పాడు శ్రీను.
19