కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'జన నాయగన్' ట్రైలర్లో పలు సన్నివేశాలు చూసి 'భగవంత్ కేసరి'ని యథాతథంగా తీసేశారని అనడం సబబు కాదని దర్శకుడు అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'మన శంకర వరప్రసాద్‌గారు' చిత్ర ప్రమోషన్స్‌లో అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'భగవంత్ కేసరి' రీమేక్‌పై ప్రశ్నించగా, అనిల్ చాలా హుందాగా స్పందించారు. సినిమా వచ్చే వరకూ సోషల్‌మీడియాలో చర్చ అనవసరమని అన్నారు.
రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అందుకే రాజకీయాలకు తన కుమారుడు, కుమార్తెను దూరంగా ఉంచినట్టు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. వీటిని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, మన భవిష్యత్ బాగుండాలంటే ప్రకృతితో కలిసి జీవించాలని కోరారు. మన పండుగలన్నీ దానితోనే ముడిపడి ఉన్నాయని గుర్తుచేశారు.