Astrology Weekly Horoscope Details

Notifications

కుంభం కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. నిపుణులను సంప్రదించండి. మీ నిర్ణయం వాయిదా వేయటం ఉత్తమం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ప్రతి చిన్న విషయానికీ అసహనం చెందుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. సోమవారం నాడు అనుకోని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల పట్ల ఏకాగ్రత వహించండి. ప్రయాణం విరమించుకుంటారు.

30-08-2026 ఆదివారం ఫలితాలు - ప్రతికూలతలు అధికం

30-08-2026 నుంచి 05-09-2026 వరకు వార ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు

30-08-2026 నుంచి 05-09-2026 వరకు వార ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టవద్దుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మంగళవారం నాడు అవగాహన లేని విషయంలో జోక్యం తగదు. కొందరు మీ వైఖరిని తప్పుపడతారు. ప్రముఖులు వాదనతో వివాదం సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఫోన్ సందేశాల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వివరాలు వెల్లడించవద్దు. మీ ఇబ్బందిని ఆప్తులకు తెలియచేయండి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. కొత్తయత్నాలు చేపడతారు.

సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?