ఆరోగ్య శాఖలో కలకలం - నకలీ డెత్ సర్టిఫికేట్లతో కారుణ్య ఉద్యోగాలు
తెలంగాణ ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి కారుణ్య ఉద్యోగాలు పొందిన కేసులో సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం పొందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన బంధువులు, మున్సిపల్ వైద్యఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
గత యేడాది మే 31వ తేదీన శాలిగౌరారం పీహెచ్‌సీ హెల్త్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ పొందిన చామకూరి వెంకటేశ్వర్లు.. నవంబర్ 17న కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు. వెంకటేశ్వర్లు సర్వీస్‌లో ఉండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఆయన కుమారుడు చామకూరి రాజు దామరచర్ల పీహెచ్‌సీలో ఉద్యోగం పొందినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం వెలుగులోకి రావడంతో మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి కేసును ఛేదించినట్లు వెల్లడించారు.

