Author P Narasimha Rao 5.html

Notifications

national news
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు.

శుక్రవారంతో ఆరుద్ర నక్షత్రం.. ఏ పూజ చేయాలి.. ఎలాంటి దానం ఇవ్వాలంటే?

Sukha Maharishi: శుక మహర్షి ఎవరు? గురువారం పూజిస్తే?

Sukha Maharishi: శుక మహర్షి ఎవరు? గురువారం పూజిస్తే?శుక మహర్షి వేద వ్యాసుని పుత్రుడు. శుక మహర్షి విచిత్రమైన ఆకారం కలవారు. తల వరకు చిలుక, శరీరం మానవ దేహం. శుక మహర్షి కూడా వేద వ్యాసుని వలే పుట్టుకతోనే పరమ జ్ఞాని. ఐతే తండ్రిని మించిన తనయుడు. వ్యాస మహర్షి ఘృతాచి అనే అప్సరసకు జనించిన వారు. వేదవ్యాసుడు ఒకసారి అరణ్యంలో తపస్సు చేసుకుంటుండగా, అక్కడ ఒక అప్సరస ఘృతాచి అనే పేరుగల చిలుక (శుకము) రూపంలో సంచరిస్తూ కనిపించింది. ఆమెను చూసినప్పుడు వ్యాసుడికి కలిగిన సంకల్పం వల్ల, అరణి (యజ్ఞం కోసం వాడే కట్టె) నుండి ఒక దివ్యమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడు చిలుక ముఖ వర్చస్సుతో, దైవిక తేజస్సుతో జన్మించడం వల్ల ఆయనకు శుకుడు అని పేరు పెట్టారు.

01-10-2026 నుంచి 31-10-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం

01-10-2026 నుంచి 31-10-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం అన్ని విధాలా యోగదాయకంమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులు, అధికారులకు అదనపు బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదర్శనంలో అవస్థలెదుర్కుంటారు.