19-08-2026 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం
Daily Predictions
ఈ రోజు కొంత మేరకు అనుకూలం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య స్వల్ప కలహం. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం తగదు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. పత్రాల రెన్యూవల్‌లో జాప్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. చాకచక్యంగా వ్యవహరించాలి. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలలో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. నోటీసులు అందుకుంటారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు తొలగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి అసహనం చెందుతారు. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. మీ వ్యక్తిత్వానికి భంగం కలగకుండా మెలగండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. ఆశావహ దృక్పథంతో మెలగండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొకదానికి ఖర్చు చేస్తారు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం శూన్యం. ఆలోచనలు చికాకుపరుస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో వ్యవహరించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు విపరీతం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలం. వాగ్దాటితో రాణిస్తారు. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. సమయానికి ధనం సర్దుబాటవుతుంది. పాత పరిచయస్తులు కలుస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఇంటి సమస్యలు చికాకుపరుస్తాయి. అతిగా ఆలోచించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. అనవసర జోక్యం తగదు. ఆప్తుల కలయికతో కుదుటపడతారు.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. చెల్లింపులు, పత్రాల రెన్యూవల్‌లో అలక్ష్యం తగదు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇతరుల జోక్యానికి తావివ్వద్దు. వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రయత్నాలు ఫలించి లక్ష్యం నెరవేరుతుంది.
