1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 15-08-2026 Daily Astrology

15-08-2026 శనివారం మీ రాశి ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Astrology
Astrology
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. నిజాయితీలో ఉంటారు. ఖర్చులు అధికం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ప్రయాణం తలపెడతారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. చిన్నపాటి పరిచయస్తులు కలుస్తారు. యోగాపై ఆసక్తి కలుగుతుంది.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. రావలసిన ధనం అందుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి. అనవసర జోక్యం తగదు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అపరిచితులను ఒక కంట కనిపెట్టండి. మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తారు. మంచి ఆహ్వానం సంతోషపరుస్తుంది. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. సమర్థతకు అంతగా గుర్తింపు ఉండదు. పరిచయస్తులు మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. లౌక్యంగా మసులుకోవాలి. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. సహించని ఖర్చు చికాకు పరుస్తుంది. ఆప్తులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. గుట్టుగా పనులు సాగించండి. కొందరు మీ ఆలోచనలను నీరుగారుస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ప్రియమైన వారిని కలుసుకుంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సహృదయంతో మెలగండి. పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
మీ కష్టం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పత్రాల్లో స్పష్టత సాధ్యపడుతుంది.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రుణ విముక్తులై రుణాలు తీర్చుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు అధికం. శుభకార్యాలకు హాజరవుతారు. పిల్లల కృషి ఫలిస్తుంది. గృహ అలంకరణలు చేపడతారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతిబంధకాలను అధిగమిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన కార్యం ముందుకు సాగుతుంది.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా అనుకూలం. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
కార్యసాధనకు పట్టుదల ప్రధానం. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సామాజిక, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...