1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 14-08-2026 Daily Astrology

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...

Daily Astrology
Daily Astrology
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయానికీ కుంగిపోవద్దు. అనుభవజ్ఞులతో సంప్రదిస్తారు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆనందం, మానసిక ఉల్లాసం ఉంటుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆలోచించి అడుగు వేయండి. తొందరపాటు నిర్ణయం తగదు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కొత్తవారితో జాగ్రత్త. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
భేషజాలకు పోవద్దు. మీ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. నగదు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి అధికం. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. వేడుకకు హాజరవుతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు సజావుగా సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్ద ఖర్చు ఎదురవుతుంది. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం కృషి ఫలిస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమయస్ఫూర్తిగా మెలగండి. తప్పటడుగు వేసే అవకాశం ఉంది. ఏకపక్ష నిర్ణయం తగదు. పెద్దల సలహా తీసుకోండి. సంప్రదింపులు వాయిదా పడతాయి. రావలసిన ధనం అందదు. ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆగిపోతాయి. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
రుణ సమస్య పరిష్కారమవుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. శుభకార్యానికి హాజరవుతారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమ అధికం, ఫలితం తక్కువ. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో మెలగండి. ఏ విషయాన్నీ పట్టించుకోవద్దు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. సాయం చేసేందుకు ఆప్తులు వెనుకాడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచించవద్దు. పత్రాలు అందుకుంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
పంతాలకు పోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. రాజీమార్గంలోనే సమస్యలు పరిష్కారమవుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతిమీ ఓర్పుకు పరీక్షా సమయం. అనుకూలతలు అంత మాత్రమే. ఆలోచనలతో సతమతమవుతారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. అవసరమైన సాయం అందిస్తారు. సంతానం విషయంలో జాగ్రత్త వహించండి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
అల్ప వర్షపాతం: తిరుమలలో వరుణ యాగం ఎందుకు జరపలేదంటే?