11-08-2026 మంగళవారం మీ రాశి ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది...
Daily Astrology
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. యత్నాలు కొనసాగించండి. మొండి బకాయిలపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి అధికం, ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
మిథునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. కీలక నిర్ణయం తీసుకుంటారు. మీ నన్ముకం వమ్ముకాదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఓర్పుతో శ్రమించండి, భేషజాలకు పోవద్దు, అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. రుణ ఒత్తిళ్లు ఎదురవుతాయి. ఆప్తుల సాయం అందిస్తారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికతపై దృష్టి పెడతారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. ఇతరుల కోసం విపరీంతంగా వ్యయం చేస్తారు. చేపట్టిన పనులు సాగవు. ప్రముఖుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అనవసర జోక్యం తగదు. ఒక సంఘటన తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. బెట్టింగ్‌కు పాల్పడవద్దు
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
చిత్తశుద్ధిని చాటుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. పదవులు చేపడతారు. ఖర్చులు అధికం. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు అధికం. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రుణసమస్య ఆందోళన కలిగిస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు, ఆత్మీయులను కలుసుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులతో సంభాషణ ధైర్యానిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. నగదు, పత్రాలు జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమయస్ఫూర్తితో మెలుగుతారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఉల్లాసంగా గడుపుతారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
