07-08-2026 నాటి రాశి ఫలితాలు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు
Daily Astrology
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. పొదుపు ధోరణి ముందుగానే అలవాటు చేసుకోండి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అనుకూలతలు అంత మాత్రమే. కష్టించినా ఫలితం ఉండదు. యత్నాలు కొనసాగించండి. ఇతరుల సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణం తలపెడతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. కీలక నిర్ణయం తీసుకుంటారు. మీ కష్టం వృథా కాదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ఆస్తుల గురించి చర్చిస్తారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు విశేషంగా శ్రమించాలి. భీమాకాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఒత్తిళ్లు అధికమవుతాయి. అవసరమైన సాయం అందుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటుకోవడానికి ఖర్చు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగవు. సన్నిహితుల కలయిక కుదరదు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. బెట్టింగ్‌కు పాల్పడవద్దు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. వ్యతిరేకులను ఎదుర్కుంటారు. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. సాధ్యం కాని హామీ ఇవ్వవద్దు. ఖర్చులు అధికం. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలుశుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. మీ ఆతిథ్యం కొంతమందికి అపోహ కలిగిస్తుంది. ఖర్చులు అధికం. సదుపాయం అందుకుంటారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి లభించవు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు కాలంలో పూర్తవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థిక స్థితి సామాన్యం. స్థైర్యానికి లోనవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. సాయం కోసం ప్రయత్నించండి. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు అర్ధాంతరంగా ఆగిపోతాయి. ఒక సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
మీ ఓర్పుకు పరీక్షా సమయం. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులతో సంభాషణ ధైర్యాన్నిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. నగదు, పత్రాలు జాగ్రత్త.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఉత్సాహంగా గడుపుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ముఖ్యమైన పత్రాలు లభ్యమవుతాయి.
