1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Spiritual Benefits of Ginger Lamp

సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?

Lamps
Lamps
కొబ్బరి దీపం - కొబ్బరి దీపం వినాయకుడికి చేసే పరిహార దీపం. కార్య ఆటంకాలు, శని దోషం తొలగి, జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులలో విజయం లభించి, మంచి ఫలితాలు పెరుగుతాయి.
 
నిమ్మకాయ దీపం - నిమ్మకాయ దీపం దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి చేసే పరిహార దీపం. రాహు-కేతు దోషం తొలగి, జీవితంలో మంచి ఫలితాలు, మనశ్శాంతి పెరుగుతాయి. వివాహ ఆటంకాలు తొలగి, త్వరలో శుభకార్య యోగం కలుగుతుంది.
 
గుమ్మడికాయ దీపం - గుమ్మడికాయ దీపం కాలభైరవుడిని ప్రార్థించి చేసే పరిహారం. దృష్టి దోషం, చేతబడి తొలగి, జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో స్తబ్దత తొలగి, అభివృద్ధి, లాభం పెరుగుతాయి.
 
మిరియాల దీపం - ఇది కూడా కాలభైరవుడి అనుగ్రహం పొందడానికి చేసే దీప పరిహారం. కానీ దీని ఫలితాలు వేరు. ఈ దీపం వెలిగించడం వల్ల శత్రువుల బాధలు తొలగి, జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. అప్పులు, కోర్టు సమస్యలు తొలగి మంచి ఫలితాలు లభిస్తాయి. 
 
ఉసిరికాయ దీపం - ఉసిరికాయ దీపం మహాలక్ష్మి అనుగ్రహాన్ని త్వరగా పొందడానికి చేసే పరిహారం. దారిద్రం తొలగి, జీవితంలో సంపద పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యం, శ్రేయస్సు నిండుతుంది. 
 
ఉప్పు దీపం - ఇది ఇంటి పూజ గదిలో చేయవలసిన పరిహారం. ఈ దీపం వెలిగించడం వల్ల దారిద్ర్యం తొలగి, కుటుంబంలో సంపద, సంతోషం పెరుగుతాయి. కుటుంబ గొడవలు తొలగి, ఐక్యత, శాంతి ఉంటాయి. 
 
అల్లం దీపం - ఇది చాలా మందికి తెలియని పరిహారం. ఇది సూర్య భగవానుడి అనుగ్రహం పొందడానికి చేసే పరిహారం. ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, విజయ యోగం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన మంచి ఫలితాలు లభిస్తాయి. 
 
తమలపాకు దీపం - తమలపాకు దీపం కుమార స్వామిని ప్రార్థించి వెలిగించే దీప పరిహారం. ఈ దీపం వెలిగించడం వల్ల అప్పుల బాధ తొలగుతుంది. వివాహ ఆటంకాలు తొలగుతాయి, కార్య విజయం చేకూరుతుంది. 
 
నువ్వుల దీపం - నువ్వుల దీపం శని దోషం తొలగడానికి శని భగవానుడిని ప్రార్థించి వెలిగించే దీప పరిహారం. ఈ దీపం వెలిగించడం వల్ల పితృ దోషం, శని దోషం తొలగుతాయి. శని భగవానుడి వల్ల కలిగే చెడు ఫలితాలు తొలగుతాయి. 
 
పిండి దీపం- ఈ దీపం అమ్మవారికి, ఇంటి దేవతకు చేసే పరిహారం. శనివారాలలో వెంకన్న స్వామికి పిండి దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. ఈ దీపం వెలిగించడం వల్ల తీరని బాధలు తొలగుతాయి. రోగాలు తొలగుతాయి, కోరికలు నెరవేరతాయి. కుటుంబంలోని ఆటంకాలు తొలగి సంతోషం వెల్లివిరుస్తుంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..