1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 17-08-2026 Daily Astrology

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

Daily Astrology
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ధైర్యంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. స్నేహితులతో కాలక్షేపం చేయండి. పనుల సానుకూలతకు శ్రమించాలి. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పు చేర్పులు సాధ్యమవుతాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ రోజు కలిసివచ్చే సమయం. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. రావలసిన ధనం అందుతుంది. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. విందుకు హాజరవుతారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ సమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆనందకరమైన వార్త వింటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. పనులు వాయిదాలు వేసుకుంటారు. పనులు వేగంగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
క్రమశిక్షణ లేకపోతే ఫలితం ఉండదు. మనస్తాపం ఎదురవుతుంది. బంధువులతో విభేదిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేయండి. ఖర్చులు విపరీతం. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. న్యాయనిపుణులతో సంప్రదిస్తారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. స్నేహ బంధాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
చక్కని పలుకులతో ఆకట్టుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొత్తవారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆత్మీయులను కలుసుకుంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ముఖ్యుల కలయికకు వీలుపడదు. జూదం, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. పనిభారం, విశ్రాంతి లోపం. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ఖర్చులు అధికం. నోటీసులు అందుకుంటారు. ఏ పనీ చేయబుద్ధి కాదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు ఇతరులకు అప్పగించవద్దు. మీ నుండి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఓర్పుతో మెలగండి. అతిగా ఆలోచించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల, వివరాలు