18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం
Daily Astrology
కష్టించినా ఫలితం శూన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఊహించని సమస్య ఎదురవుతుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అపరిచితులను ఒక కంట కనిపెట్టండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. భేషజాలకు పోవద్దు. పెద్దల సలహా పాటించండి. పెట్టుబడులకు తగిన సమయం కాదు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఖర్చులు అధికం, కానీ ప్రయోజనకరం. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ముఖ్యుల కలయికకు వీలుపడదు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమయస్ఫూర్తితో మెలగండి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారినా ఒక విధంగా మంచిదే. ఖర్చులు అదుపులో ఉండవు. తెలియని వెలితి వెంటాడుతుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. సన్మాన సభల్లో పాల్గొంటారు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. ఊహించని ఖర్చు నిరుత్సాహపరుస్తుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనుల్లో ఒత్తిడి అధికం. పరిచయం లేని వారితో జాగ్రత్త.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రియమైన వారితో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మొండి బాకీలు వసూలవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ముఖ్యుల కలయికకు వీలుపడదు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. జూదం, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆప్తుల సలహా తీసుకోండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. అనవసర జోక్యం తగదు. దూరంగా ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి లభిస్తాయి.
