సంబంధిత వార్తలు
15-03-2026 ఆదివారం దినఫలాలు : స్థిరాస్తి ధనం అందుతుంది.. ఖర్చులు అధికం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఊహించని ఖర్చు తగులుతుంది. దంపతుల మధ్య కలహం. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులు వాయిదా పడతాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. ఆప్తులను కలుసుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ధనసహాయం తగదు. ఆచితూచి అడుగేయాల్సిన సమయం. అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మాట నిలబెట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. కొందరి వ్యాఖ్యులు ఆలోచింపచేస్తాయి. అపోహలకు తావివ్వవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సోదరవర్గం వారితో సమస్యలు తలెత్తుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆత్మీయులతో సంభాషిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చుచేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా ఆశాజనకం. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. లక్ష్యానికి చేరువవుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. స్థిరాస్తి ధనం అందుతుంది. అర్థాంతంగా ముగిసిన పనులు పూర్తవుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఖర్చులు అధికం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. ముఖ్యులను సంప్రదిస్తారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యానికి చేరువవుతున్నారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనవసర విషయాల్లో జోక్యం తగదు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ప్రయాణం సజావుగా సాగుతుంది.
