1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 11-03-2026 Your Daily Horoscope

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

Astrology
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ ఓర్పునకు పరీక్షాసమయం. ధృఢసంకల్పంతో శ్రమించాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించి భంగపడతారు. అనుకోని ఖర్చు ఎదురవుతుంది. పనులు మధ్యలో నిలిపివేయవద్దు. శుభకార్యానికి హాజరవుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ ఫైనాన్సులు జోలికి పోవద్దు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మొదలెట్టిన పనులు ఒక పట్టాన సాగవు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మీ కష్టం వృధా కాదు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. పెద్ద ఖర్చు తగిలే అవకాశం ఉంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యం సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమువుతుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఓ సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఖర్చులు అధికం. మీ ఉన్నతిని విచ్చలవిడిగా చాటుకోవటానికి ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు, 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తల పెట్టిన కార్యం సఫలమవుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. వ్యాపరాలు అధికమవుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. నోటీసులు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. మితంగా సంభాషించండి. ఆగ్రహావేశాలకు లోనుకావచ్చు. ధన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్ధికస్థితి సామాన్యం. నిస్తేజానికి గురవుతారు. ఖర్చులు విపరీతం. చేస్తున్న పనులపై దృష్టి పెట్టండి. మీ ఏమరుపాటుతనం ఇబ్బంది కలిగిస్తుంది. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. మీ మాటతీరు అందరికి ఆకట్టుకుంటుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలతో తీరిక ఉండదు. శారీరకశ్రమ, అకాలభోజనం, ఆలోచనలతో సతమతమవుతారు. కష్టించినా ఫలితం ఉండదు. మీ సామర్ధ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఏ విషయానికి స్పందించవద్దు. చేసిన పనులు మొదటికి వస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళతారు. వాహనం అమర్చుకోవాలనే కోరిక నేరవేరుతుంది. కీలక పత్రాలు జాగ్రత్త. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఆహ్వానం అందుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పసిద్ధికి కృషి, పట్టుదల ప్రధానం. ఆశావహదృక్పథంతో శ్రమించండి. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పెద్ద ఖర్చు తగిలే సూచనలు వున్నాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడవండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. ఆటంకాలెదురైనా పనులు పూర్తవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. అనవసర వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
About Writer
రామన్
తర్వాతి కథనం
12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..