సంబంధిత వార్తలు
- 31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...
- 30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...
- శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి
- 28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి
- 27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం
01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికలావాదేవీలతో సతమతమవుతారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య కలహం.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. నోటీసులు అందుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. విందులకు హాజరవుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. రావలసిన ధనం అందుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రయాణం తలపెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. సన్నిహితులతో సంభాషిస్తారు. నగదు విలువైన వస్తువులు జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, ఉంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. వ్యవహారాలతో సతమతమవుతారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సాగవు. పత్రాలు అందుకుంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల కొందరికి స్ఫూర్తినిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. ఆడంబరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొత్తపనులు ప్రారంభిస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చాకచక్యంగా వ్యవహరిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ జోక్యం అనివార్యం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
