శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శుభలేఖ అందుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పసులు మధ్యలో నిలిపివేయవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త కీలక పత్రాలు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. పనులు సానుకూలమవుతాయి. నగదు చేసేటపుడు జాగ్రత్త. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా వారికి నచ్చజెప్పండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తల పెట్టిన కార్యం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పొదుపు ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పొగిడే వ్యక్తుల అంతర్యం గ్రహించండి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికి చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖులకు సాదర విడ్కోలు పలుకుతారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు నియంత్రించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం, ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి, ధన సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ప్రముఖులు సందర్శనం వీలుపడదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ కలుపుకోలు తనం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు చేరవవుతారు. శుభకార్యానికి యజ్ఞాలు సాగిస్తారు. పనులు పురమాయించవద్దు. దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రయాణం కలవరపెడతారు.
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. సన్మాన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్వఘ్నంగా సాగుతాయి. మీ సామర్థ్యంపై సమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు పురమాయించవద్దు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. పత్రాల రెన్యువల్‌లో మార్పులు సాధ్యమవుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. సమర్ధతను చాటుకుంటారు. అభీష్టం నెరవేరుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు చక్కబడతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య అకారణ కలహం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.
