25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఖర్చులు అదుపులో ఉండవు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఒక పట్టాన పనులు సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశీ సందర్శనలకు యత్నాలు సాగిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. పెద్దఖర్చు తగుల్తుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణసమస్యలు పరిష్కారమవుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. స్థిరాస్తి వ్యవహారంలో జాగ్రత్త. వేడుకలు, విందుకు హాజరవుతారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు పురమాయించవద్దు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ దృష్టి మరల్చేందుకు కొందరు యత్నిస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి లభిస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మొండిబాకీలు వసూలవుతాయి. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి, ఆలయాలు సందర్శిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహకలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొత్త పనులు మొదలెడతారు. ఖర్చులు విపరీతం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలదాయకం. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. పనులు పురమాయించవద్దు. కీలక పత్రాలు అందుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని ఏమరుపాటుగా వదిలి వెళ్లకండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆహ్వానం అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.
