1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 23-05-2025 Daily Astrology

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చు ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త, గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం, అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడవండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. రుణసమస్య పరిష్కారమవుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆగ్రహావేశాలకు గురిపోవద్దు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాగ్రత్త వహించండి. ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులెదుర్కుంటారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్య సాధనకు సంకల్ప బలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాలు. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. పొదుపు ధనం గ్రహిస్తారు. అధిురాలు నెరవేరుతాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. లావాదేవీలతో సతమతమవుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పత్రాల్లో సవరణలకు అనుకూలం.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఉహించినట్లే జరుగుతాయి. ఖర్చులు విపరీతం, పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అపరిచితులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1,2, 3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో శ్రమించండి. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక  పత్రాలు అందుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దలను సంప్రదించండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు అస్తవ్యస్తంగా  సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం పరిచయక్తులు తారసపడతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలం. లక్ష్యాన్ని సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సమర్థతపై నమ్మకం సన్నగిల్లుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ఇతరులకు పురమాయించవద్దు. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
 
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?