సంబంధిత వార్తలు
- 21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు
- 20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది
- 19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి
- 18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...
- 17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..
22-05-2026 శుక్రవారం ఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే
Daily Astrology
నేడు సర్వత్రా అనుకూలం. వ్యవహారజయం, వాహనసౌఖ్యం ఉన్నాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఉల్లాసంగా గడుపుతారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. అపజయాలకు కుంగిపోవద్దు. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు, ఆలోచనలతో సతమతమవుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడులు తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనాలోచిత నిర్ణయాలు తగవు ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్య సాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఓర్పుతో పనులు పూర్తిచేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. శుభవార్త వింటారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా యోగదాయకమే. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి నిర్విరామంగా శ్రమిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మితంగా సంభాషించండి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1,2, 3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
స్థిరాస్తి ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. లక్ష్యాన్ని సాధించే వరకూ శ్రమించండి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాల్లో తొందరపాటు తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో మంచి ఫలితాలున్నాయి. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబీకుల ప్రోతాహం ఉంటుంది. చేసిన పనులే చేయవలసి వస్తుంది. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే చికాకుపడతారు. ఎవరినీ నిందించవద్దు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణంలో ఒకింత అవస్థలెదుర్కుంటారు.
