1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 21-05-2025 Daily Astrology

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం.
మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. శుభకార్యానికి హాజరవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణ విముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. ఓర్పుతో శ్రమించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. లైసెన్సుల రెన్యువల్‌లో జాప్యం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఖర్చులు విపరీతం, మితంగా సంభాషించండి. పనులు పురమాయించవద్దు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆచితూచి అడుగేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. నోటీసులు అందుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. భకులు పురమాయించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉండండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధ్యం. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. పొదుపు ధనం గ్రహిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధనలాధం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ సామర్థ్యంపై ధైర్యం కలుగుతుంది. ఆటంకాలెదురైనా ముందుకు సాగుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. యత్నాలకు పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల్లో ఒత్తిడి అధికం. ముఖ్యులు సందర్శనం వీలుపడదు. లైసెన్సుల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తల పెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన  పదవులు దక్కకపోవచ్చు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధికి ఓర్చుతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. ముందుచూపుతో వ్యవహరించండి. అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణం తలపెడతారు.
About Writer
పి.ప్రసూనా రామన్