సంబంధిత వార్తలు
- 19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి
- 18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...
- 17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..
- 16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?
- 15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది
20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం.
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికావద్దు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. స్థిరాస్తి ధనం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. సన్నిహితులను కలుసుకుంటారు. ఇతరుల విషయంలో అనవసర జోక్యం తగదు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు విపరీతం విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త, పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టింపులకు పోవద్దు. లౌక్యంగా మెలగండి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని సమస్య అనుకోవద్దు. మనో ధైర్యంతో యత్నాలు సాగించండి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పనులు ఇతరులకు పురమాయించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు ఫలిస్తాయి. రుణవిముక్తులవుతారు. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. చిరకాల మిత్రులను కలసుకుంటారు. పసులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అనవసర ఒత్తిడికి గురికావద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యం తలపెడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. స్వయంకృషితోనే కార్యం సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. పనులు పరమాయించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. అన్ని విధాలా శుభమే జరుగుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలయాలను విరాళాలు అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాలు. పత్రాలు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. ధనసమస్యలెదురయ్యే సూచనలున్నాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి.
