సంబంధిత వార్తలు
- 17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..
- 16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?
- 15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది
- 14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు
- 13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది
18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం.
విలాసాలకు ఖర్చుచేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పరిచయాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. వాహనం జాగ్రత్తగా నడపండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా అలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు చురుకుగా సాగుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు సంకల్పసిద్ధి ముఖ్యం. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. శుభలేఖ అందుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా అనుకూలదాయకం. వాక్పటిమతో నెట్టుకొస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గుట్టుగా మెలగండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపుచేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కలిసివచ్చే సమయం. ధైర్యంగా ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆర్థికపరంగా మంచి ఫలితాలున్నాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అనవసర జోక్యం తగదు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
విశేషఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కారక్రమాలు వాయిదా వేసుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంకల్పబలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి, మితంగా సంభాషించండి. ఆగ్రహావేశాలకు గురికావద్దు. చర్చల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అనుమానాలకు గురికావద్దు. కొందరి వ్యాఖ్యులు ఉద్రేకపరుస్తాయి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. వేడుకకు హాజరవుతారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
తర్వాతి కథనం
