15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది
Daily Astrology
కార్యానుకూలత ఉంది. లావాదేవీలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సామాన్యం. నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ముఖ్యల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇతరుల సలహా పాటిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. శుభలేఖ అందుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. బంధువులతో సంభాషిస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పసులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నేడు అన్ని విధాలా అనుకూలం. ధైర్యంగా యత్నాలు సాగించండి. చేస్తున్న పనులు మధ్యలో ఆపివేయవద్దు. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. సంప్రదింపులు ఫలిస్తాయి
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మాటతీరును అదుపులో వుంచుకోండి. ఎవరినీ నొప్పించవద్దు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. ఊహించని ఖర్చు తగులుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయాన్ని రాబట్టేందుకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విర్వామంగా సాగుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు సామాన్యం, పనులు మందకొడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రశాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పనుల్లో ఒత్తిడి జాప్యం అధికం. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచార ఉపశమనం కలిగిస్తుంది. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు ఒక పట్టాన సాగవు. ప్రముఖుల ఇంటర్వ్యూ కుదరవు. ప్రయాణం విరమించుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. సాయం ఆశించవద్దు, పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించింది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. అపరిచితులతో మితంగా సంభాషించండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు, సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వాహనయోగం. వస్తులాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం, పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. బెట్టింగ్‌కు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కృషి ఫలిస్తుంది. ఆర్థికంగా సర్దుకుంటారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
