సంబంధిత వార్తలు
12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. సమయస్ఫూర్తిగా మెలగండి. ప్రలోభాలకు లొంగవద్దు, కొత్త యత్నాలు చేపడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవచ్చు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. కీలక పత్రాలు అందుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పొదుపు ధనం అందుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. చేసిన పనులే తిరిగి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్ధికంగా ఆశించిన ఫలితాలున్నాయి. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉత్సాహపరుస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. ఇతరుల సాయం ఆశించవద్దు. పనులు వేగవంతమవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పన్నులు సానుకూలమవుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. కావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వింటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు సామాన్యం. పిల్లల చదువుపై దృష్టిపెడతారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. రావలసిన ధనం అందుతుంది. రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. చెల్లింపులో అలక్ష్యం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వాహనదారులకు దూకుడు తగదు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్విరామంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహార లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగపు ఆప్తులకు సాయం అందిస్తారు. ఆకస్మిక ప్రయాణం తలపెట్టారు.
