సంబంధిత వార్తలు
09-05-2026 శనివారం ఫలితాలు - అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికలావాదేవీలతో సతమతమవుతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే విజయం తథ్యం. పట్టుదలకు పోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు సత్ఫ్రాభావం చూపుతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. కొత్త పనులు చేపడతారు. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. దైనదర్శనాలు, ఉల్లాసాన్నిస్తాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులకు తగిన సమయం. లావాదేవీలతో ఒత్తిడికి గురి కావద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల్లో శ్రమ చికాకులు అధికం. ఖర్చులు సామాన్యం. కొత్త సమస్య ఎదురవుతుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగకుండా చూసుకోండి. ఖర్చులు అధికం చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ప్రతికూలతలకు కుంగిపోవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. హామీలు నెరవేర్చుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ సమర్థతపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. స్థిమితంగా ఆలోచించి పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. వాహనదారులకు దూకుడు తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. మీ కలుపుకోలుతనం ఇతరులను ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆగిపోయిన పరులు పునఃప్రారంభమవుతాయి
ధనస్సు మూల, పూర్వాషాడ 13.5 4 పాదములు, ఉత్తరాహర 1వ పాదం
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కొందరి వ్యాఖలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. మిమ్మల్ని విమర్శించిన వారు మీ వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. మితంగా సంభావించండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని విధాలా యోగదాయకమే, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. చేపట్టిన పనుల సానుకూలమవుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు, పనిభారం, విశ్రాంతి లోపం. ఆలోచనలతో సతమతమవుతారు. రావలసిన ధనాన్ని సౌమ్యంగా రాబట్టుకోవాలి. పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఉచితంగా ఏదీ ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థంపై నమ్మకం పెంచుకోండి. బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.
