27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం
Daily Astrology
కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారిపోతాయి. నిస్తేజానికి లోనవుతారు. చేబదుళ్లకు స్వీకరిస్తారు. సన్నిహితులు సాయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. దంపతుల మధ్య స్తబ్ధత నెలకొంటుంది. కొత్త యత్నాలు మొదలు పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుభకార్యానికి హాజరువుతారు.
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి అనుకూలం. అనుకున్నది సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. చేతిలో ధనం నిలవదు. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా అనుకూలతలున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం, ఆశావహదృక్పథంతో మెలగండి. సాయం ఆశించవద్దు. మీ పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వివాదాలకు దిగవద్దు. సన్నిహితులను కలుసుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్య సాధనకు మరింత శ్రమించాలి. ధైర్యంగా ముందుకు సాగండి. దంపతుల మధ్య అకారణ కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయంలో అనవసర జోక్యం తగదు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహసంచారం బాగుంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నేడు అనుకూలదాయకం. కార్యసిద్ధి ధనలాభం ఉన్నాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ కృషి స్పూర్తిదాయకమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారాలతో వీరికి ఉండదు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. విషయాల్లో అక్రగదు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైనా రంగంలో రాణిస్తారు. తొందరపడి హామీలివ్వవద్దు. రావలసిన ధనం అందుతుంది. కొంత మొత్తం, పొదుపు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆశావహదృక్ఫథంతో వెలగండి. ఏ విషయాన్ని సమస్యగా భావించవద్దు, ఖర్చులు తగ్గించుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. చర్చల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
