సంబంధిత వార్తలు
26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. మితంగా సంభాషించండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు ధనసహాయం చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు.
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. అనుకున్న ఖర్చులే ఉంటాయి. కొత్తపనులు చేపడతారు. అనవసర జోక్యం తగదు. పత్రాలు అందుకుంటారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్ధికంగా ఇబ్బంది లేకున్నా వెలితిగా ఉంటుంది. నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచింపవద్దు. ఇష్టమైన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. మనోధైర్యంతో శ్రమిస్తారు. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో సతమతమవుతారు. ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. దుబారా ఖర్చులు అధికం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. అనవసర జోక్యం తగదు. ప్రయాణం తలపెడతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. అననవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తపనులు మొదలెడతారు. అవకాశాలను వదులుకోవద్దు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి.
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ సమస్య నుంచి బయటపడతారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. మీ అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అందరితోను మితంగా సంభాషించండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ధనసహాయం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అభీష్టం నెరవేరుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. నోటీసులు అందుకుంటారు. సోదరులను సంప్రదిస్తారు. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఊహించని ఖర్చులెదురవుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
