09-08-2026 నుంచి 15-08-2026 వరకు వార ఫలితాలు నేడు సాధ్యం కానిది రేపు...?
Weekly Horoscope, August 9-15, 2026
ఈ వారం అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. మరోసారి యత్నించండి. నేడు సాధ్యం కానిది రేపు అనుకూలిస్తుంది. సంతానం కదలికలపై దృష్టిసారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వెండి, బంగారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుంచి విముక్తి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ పనితీరు ప్రశంసదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి, ధనసహాయం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. పలుకుబడి కలిగిన వారికి సన్నిహితులవుతారు. దూరపు బంధువులు ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలకు స్పందన లభిస్తుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన, ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు తగిన సమయం. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. చిన్ననాటి గురువులు తారసపడతారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, అదనపు బాధ్యతలు, అధికారులకు హోదా మార్పు, వస్త్ర, బంగారు, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయవాదులకు ఆదాయాభివృధ్ధి. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఆదాయం సంతృప్తికరం. వాహనం కొనుగోలు చేస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. బుధవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన స్నేహసంబంధాలు బలపడతాయి. ఆశావహదృక్పధంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి బాగుంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సష్టాలను భర్తీ చేసుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం కలిసివస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదాయం అంతంతమాత్రమే. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. శుక్రవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి, ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. ఒంటెద్దుపోకడ తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల పట్ల ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు కొంతమేరకు చక్కబడతాయి. నిర్దిష్టప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆదివారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆహ్వానం అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం, ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అప్రియమైన వార్త వినవలసివస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. అయిన వారి మధ్య ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయ అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదురుంటారు. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో విలదొక్కుకుంటారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు చేపడతారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. రశీదులు, కీలక పత్రాలు జాగ్రత్త. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గురువారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వీటికి మాటికి విడాకుపడతారు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుతులుగుతుంది. వస్త్ర వెండి, బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు బాధ్యతగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగపడ్డు, వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలదాయకం, మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. స్నేహసంబంధాలు బలపడతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ పెద్దగా తీసుకోవద్దు. సోమవారం నాడు కొత్త సమస్య ఎదురవుతుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. మీ సాయంతో ఒక మేలు జరుగుతుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మొండిబాకీలు, అతికష్టంమ్మీద వసూలవుతాయి. ఖర్చులు అధికం ప్రయోజనకరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బుధవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. బంధువులు రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులు మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. ఇతరుల హితవు మీపై సత్ప్రభావం రూపుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ఓర్పుతో మరోసారి ప్రయత్నించండి. వస్త్ర, బంగారం వెండి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం, పై అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం కలిసి వచ్చిన అవకాశాలను కరణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబళ్లు స్వీకరిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం, శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులు హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు, ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉపాధి పథకాలు సంతృప్తినీయవు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మనస్థిమితం ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవుతుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మంగళవారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూల వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం శుభకార్యానికి హాజరుకాలేదు.
