1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Constable Performs CPR, Saves TGSPDCL Worker’s Life in Hyderabad

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

conistable
conistable
సమయస్ఫూర్తితో వ్యహరించిన ఒక కానిస్టేబుల్ తీవ్ర విద్యుత్ షాక్‌కు గురైన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) కాంట్రాక్టు ఉద్యోగి ప్రాణాలను కాపాడారు. తప్పచబుత్ర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్.. కార్వాన్ విద్యుత్ కార్యాలయానికి చెందిన 44 ఏళ్ల అసిస్టెంట్ లైన్‌మెన్ రాజు నాయక్, కార్వాన్‌లోని కుమ్మరవాడి హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఒక విద్యుత్ స్తంభంపై లైన్ మరమ్మతు పనులు చేపడుతున్నారు. 
 
ఈ క్రమంలో, అతను ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న హై-టెన్షన్ తీగను తాకడంతో, తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై, స్తంభం పైనుండి కిందపడిపోయారు. వెంటనే స్పృహ కోల్పోయారు. ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న సురేష్ గందరగోళాన్ని గమనించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి పరుగెత్తుకెళ్లాడు. 
 
కార్మికుడు స్పృహలో లేకపోవడం, శ్వాస తీసుకోవడం లేదని గమనించిన సురేష్, వెంటనే కార్డియో-పల్మనరీ రెస్యూసిటేషన్ (సీపీఆర్) ప్రారంభించాడు. అతను క్రమపద్ధతిలో ఛాతీపై నిరంతరంగా ఒత్తిడి కలిగించడంతో, బాధితుని నాడి విజయవంతంగా తిరిగి పనిచేయడం ప్రారంభించి, అక్కడికక్కడే తాత్కాలికంగా శ్వాసను పునరుద్ధరించారు. అత్యవసర ప్రథమ చికిత్స విజయవంతంగా అందించిన అనంతరం, సురేష్ స్థానికుల సహాయంతో గాయపడిన కార్మికుడిని మెరుగైన వైద్య సంరక్షణ కోసం అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తరలించాడు. 
 
ఆ కార్మికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యవసర సమయంలో, సీపీఆర్ అందించడం వల్లే ప్రాణాపాయం తప్పిందని, తద్వారా అతని ప్రాణాలు కాపాడటం సాధ్యమైందని వారు పేర్కొన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
4వ త్రైమాసికంలో బలమైన వృద్ధిని ప్రకటించిన ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా