సంబంధిత వార్తలు
- హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. నిందితుల్లో మాజీ మంత్రి సోదరుడు
- Sonam Raghuvanshi: రాజా రఘువంశీ హత్య కేసు.. 790 పేజీల ఛార్జిషీట్
- Toxic song: యశ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా తబాహీ సాంగ్
- టాటా ప్లే బింజ్‌లోకి ఈటీవీ విన్: ఇక జాతీయ స్థాయిలో తెలుగు హిట్ చిత్రాలు
- Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్
Eluru Srinu : బర్నింగ్ ఇష్యూ ఆధారంగా డ్యూ డేట్ చిత్రం ప్రారంభం
Eluru Srinu, Anand K., Lomesh Pudipeddi, Jayashree, SKN, Dheeraj Mogilineni and others
ఈ సందర్భంగా హీరో లోమేష్ పూడిపెద్ది, హీరోయిన్ జయశ్రీ, తో పాటు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ప్రణీత పట్నాయక్, విజ్క్షానిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్ నివ్వగా, బన్నీవాస్ కెమెరా స్వీచ్చాన్ చేశారు. ఇటీవల సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారిన నిర్మాతలు ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు, దర్శకుడు విజయ్ కనకమేడల, విఐ ఆనంద్‌లతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్డ్ రూమ్ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుందని, టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.
లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, చందు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: చెంచు జింక, నిర్మాతలు పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను, దర్శకత్వం: ఆనంద్.కె.
