1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Can diabetics eat Al-Bakara fruits?

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

Albakara Fruits
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్‌బకరా పండ్లు. ఈ ఆల్‌బకరా పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
జ్యూసీగా ఉండే ఈ ఆల్‌బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్‌ ఇందులో చాలా వుంది.
వీటిల్లోని ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. 
రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతాయి. విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి.
ఆల్‌బకరా పండ్లలో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పండ్లను తగు మోతాదులో తీసుకోవచ్చు.
ఈ పండులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, అల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయపడుతుంది.
ఆల్‌బకరా పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
ఎండు ఆల్‌బకారాలను రోజుకు నాలుగైదు తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు సమస్యలుండవు.
మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే ఆస్ట్రియోపోరోసిస్‌ని కూడా ఇవి నివారిస్తాయని నిర్ధారించారు.
 
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
Moringa Leaves: మునగాకు పొడిని ఇలా వాడితే...?