Moringa Leaves: మునగాకు పొడిని ఇలా వాడితే...?
Moringa Powder
రక్తహీనత, ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరిచి, కండరాలకు బాలాన్నిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడంలో, గుండె, కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. మునగాకును పొడి రూపంలో లేదా పప్పులో వేసుకుని, కూర వండుకుని తీసుకోవచ్చు. అయితే, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య నిపుణులను సంప్రదించి తీసుకోవడం మంచిది.
మునగ ఆకులు మహిళల్లో అసమతుల్య హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. ప్రధానంగా చాలా మంది మహిళలు థైరాయిడ్, పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
ఈ వ్యాధులు హార్మోన్ల అసమతుల్యత కారణంగా సంభవిస్తాయి. ఈ సమస్యలను అధిగమించడానికి, మునగ ఆకులను తినవచ్చు. మునగ ఆకులను టీ లేదా పొడి రూపంలో తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
