రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగిపోయిన మహిళ మృతి
Woman
బుధవారం రోజున కంపెనీ అధికారిక మీటింగ్ కోసం ఉన్నావ్‌లోని బాంగర్‌మౌ వెళ్లేందుకు ఆమె హర్దోయ్ బస్టాండ్‌కు చేరుకుంది. నేహా సింగ్ బస్సు ఎక్కడం కోసం నడుచుకుంటూ వెళుతున్న సమయంలో హర్దోయ్, కన్నౌజ్ డిపోలకు చెందిన ఇద్దరు డ్రైవర్లు అజాగ్రత్తగా ఒకేసారి బస్సులను ముందుకు తీశారు.
దీంతో ఊహించని విధంగా ఆ రెండు బస్సుల ముందు భాగాల మధ్య నేహా తీవ్రంగా నలిగిపోయి తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటనలో మహిళ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
