కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. వేధించిన డాక్టర్.. వీడియో తీసి?
Radiologist
వైద్యం చేయాల్సిన వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాక బెదిరింపులకు కూడా దిగాడు. స్కానింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆ డాక్టర్ ఆమెను అనవసరంగా తాకడం ప్రారంభించాడని.. ఆపై అభ్యంతరకరంగా తాకాడు.
దీనిపై బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీనిని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. డాక్టర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితురాలు ఆ సంఘటనను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి ఉంచింది. ఈ వీడియో ఆధారంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టలేదు.
