సంబంధిత వార్తలు
- 10 తాజా లేత ఆకులను నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని తాగితే?
- వైకాపా నుంచి రూ.10లక్షల కోట్ల రుణాలను వారసత్వంగా పొందాం.. బాబు
- డిప్యూటీ సీఎం పవన్ సాయంతో టెన్త్ క్లాసులో 555 మార్కులు సాధించిన పవన్ కుమార్
- మీరేమైనా దేశ ప్రధాన పురోహితులా? మీకు వేరే పనేమీ లేదా? సుప్రీం కోర్టు ఫైర్
- 10 సీట్లు కావాలి.. రెండు వారాల్లో నిరూపిస్తానన్న విజయ్.. టీవీకేకి నిత్యానంద స్వామి శుభాకాంక్షలు
మే 10, 11 తేదీలలో టిటిడి ఇంజినీరింగ్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
తిరుపతి: టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో వివిధ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి 2026 మే 10, 11 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 93 పరీక్షా కేంద్రాలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత పోస్ట్ లకు సంబంధించి కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఏఈఈ (సివిల్)- 93 కేంద్రాలు, ఏఈఈ (ఎలక్ట్రికల్)- 16 కేంద్రాలు, ఏఈ (సివిల్)- 42 కేంద్రాలు, ఏటీవో (సివిల్) – 42 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి.
పోస్టుల భర్తీకి క్రింది షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయి.
పరీక్షల షెడ్యూల్
AEE (సివిల్)- 10.05.2026 – ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు
AEE (ఎలక్ట్రికల్)- 10.05.2026 – మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు
AE (సివిల్)- 11.05.2026 – ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు
ATO (సివిల్)- 11.05.2026 – మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం రెండు గంటల ముందుగానే చేరుకోవాలని టిటిడి సూచించింది. నిర్దేశిత సమయానికి అనంతరం వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరు. అలాగే పరీక్షా కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, రిస్ట్ వాచ్‌లు తదితర వస్తువులను అనుమతించరు. హాల్ టికెట్‌లో పేర్కొన్న నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమాచారాన్ని టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల శాఖ విడుదల చేసింది.
