సంబంధిత వార్తలు
14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు
Astrology
సర్వత్రా అనుకూలం. శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు సానుకూలనువుతాయి. ఒత్తిడికి గురికావద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రసీదులు జాగ్రత్త.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు సామాన్యం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనుల్లో ఒత్తిడి అధికం. నోటీసులు అందుకుంటారు. ప్రముఖులకు స్వాగతం. వీడ్కోలు పలుకుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గత అనుభవంతో జాగ్రత్త వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారిని సంప్రదిస్తారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక వ్యవహారంపై పట్టుసాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు. పనులు ఇతరులకు పురమాయించవద్దు. కొత్త వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు, పరిచయస్తులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు, విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమతో కూడిన విజయాలున్నాయి. సంకల్పబలంతోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ప్రయాణంలో కొత్త వారితో జాగ్రత్త.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంపద్రింపులు పురోగతిన సాగుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనులు ఒక పట్టాన సాగవు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
