సంబంధిత వార్తలు
11-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అందుపులో ఉండవు. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమించినా ఫలితం శూన్యం. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పనులు ముందుకు సాగవు. పెద్దలను సంప్రదిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. అప్రియమైన వార్త వింటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో మంచి ఫలితాలున్నాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు సామాన్యం. ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగి విషయాలు వెల్లడించవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆత్మీయులను కలుసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నేడు ఆశాజనకం. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పరధ్యానంగా ఉంటారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధనసహాయం తగదు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. శ్రమించినా ఫలితం ఉండదు. అపజయాలకు కుంగిపోవద్దు. బంధువుల వైఖరి కష్టమనిపిస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఖర్చులు అధికం. అనవసర జోక్యం తగదు. శుభలేఖ, ముఖ్యమైన పత్రాలు, అందుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. పరిచయస్తుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలు చేపడతారు. వివాహయత్నాలు తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. పత్రాల రెన్యువల్లో అలసత్వం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు. పందాలు, సాహసకృత్యాలకు పాల్పడవద్దు.
తర్వాతి కథనం
