1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 17-05-2016 Daily Astrology

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. నిలిపి వేసిన పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు విపరీతం. ముఖ్యలను కలిసినా ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఏ విషయానికి అధైర్యపడవద్దు. ఖర్చులు సామాన్యం, ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వాయిదా చెల్లింపులు నిర్లక్ష్యం చేయకండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సంతృప్తికరం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పనులు త్వరతగతిన సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకు లోనుకావద్దు. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు ఇతరులకు పురమాయించవచ్చు. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్‌లో జాగ్రత్త. ఫోన్ సందేశాలు నమ్మవద్దు సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీల్లో భేషజాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు సామాన్యం. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మాటతీరుతో నెట్టుకొస్తారు. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. ఏ విషయాన్ని అతిగా ఆలోచించవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. రుణ విముక్తులవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు  మందకొడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు, ద్విచక్రవాహనదారులకు అవసరం తగదు
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం, ఉత్సాహంగా యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం, పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు చేసుకుంటారు. మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు అనుకూలిస్తాయి, లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆహ్వానం, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
About Writer
పి.ప్రసూనా రామన్