1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Bandi Sanjay son Bandi Bageerath POCSO case : Victim statement recorded

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

bhageeratha reddy
కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ చిక్కుల్లో పడ్డారు. ఓ యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై హైదరాబాద్ నగర పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. దీంతో ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పరారీలో ఉన్నాడు. మరోవైపు, కోర్టు బెయిల్ కోసం ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. మేడ్చల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను 40 నిమిషాల పాటు రికార్డు చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాలను రెండుసార్లు పోలీసులు నమోదు చేశారు. 
 
మరోవైపు, భగీరథ్‌ దేశం దాటిపోకుండా పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అతడి కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదుకావడంతో అతడితో టచ్‌లో ఉన్నవారిపై, స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా సారించారు. బంజారాహిల్స్‌లోని బండి సంజయ్‌ ఇంట్లో ఒక బృందం తనిఖీలు చేపట్టింది. 
 
మరోవైపు, ఈ కేసు విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కావడం వల్లే నిందితుడుని అరెస్టు చేయకుండా ప్రభుత్వం తాస్కారం చేస్తోందంటూ విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదై రోజులు గడిచిపోతున్నప్పటికీ పరారీలో ఉన్న నిందితుడుని పోలీసులు గుర్తించలేకపోవడాన్ని కూడా విపక్ష నేతలు తప్పుబడుతున్నారు. 
 
గ్వాలియర్‌లో కిడ్నాప్ చేసి... బెంగుళూరులో గ్యాంగ్ రేప్... 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు.. ఆ బాలికను బెంగుళూరు నగరానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు మహిళతో పాటు మొత్తం ఐదుగురుని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత జనవరి నెలలో గ్వాలియర్‌కు చెందిన ఓ బాలికను నిందితులు కిడ్నాప్ చేసి బెంగుళూరుకు తరలించారు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి ఫిబ్రవరి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను మయామాటలు చెప్పి బెంగుళూరుకు తీసుకెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలిక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి రక్షించారు. ఆ సమయంలో ఆమె బందీగా ఉంచిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం బాలికను గ్వాలియర్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు ఉంచి తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
ఇంటికి చేరుకున్న తర్వాత ఆ బాలిక తనకు జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. బెంగుళూరులో తనను బందీగా ఉంచడంతో పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వాపోయింది. ఇందుకు ఇద్దరు మహిళలు కూడా సహకరించారని బాలిక చెప్పడంతో తల్లి మరోమారు పోలీసులను ఆశ్రయించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇంట్లో ఇల్లాలు, ఆసుపత్రిలో ప్రియురాలు, విజయవాడ వైద్యుడి నిర్వాకం