సంబంధిత వార్తలు
- 18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...
- 17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..
- 16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?
- 15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది
- 14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు
19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి
Daily Astrology
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోను రాజీ పడొద్దు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వేడుకకు ఆర్భాటంగా చేస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం, కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
దృఢసంకల్పంతో అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. నోటీసులు అందుకుంటారు. పెద్దలను సంప్రదిస్తారు. మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులకు సన్నిహితులపుతారు. సభ్యత్వం స్వీకరణకు అనుకూల సమయం. వ్యతిరేకులతో జాగ్రత్త, అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పనులు నిలిపివేయవు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. బకాయిలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్రా ప్రోత్సాహకరం. ఆప్తుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. నిర్ధిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. అప్రియమైన వార్త వింటారు. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు కొలిక్కివస్తాయి. విస్తృతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలిసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణనముస్యలు తొలగి తాకట్టు విడిపించుకుంటారు. రోజువారి ఖర్చులే ఉంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒత్తిడికి గురవకుండా చూసుకోండి. అతిగా శ్రమించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. రోజువారి ఖర్చులే ఉంటాయి. పనులు త్వరతగతిన సాగుతాలు. పరిస్థితులకు తగినట్లుగా మెలగండి. ఎవరిని తక్కువగా అంచనా వేయొద్దు. శుభకార్యానికి హాజరవుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆత్మస్థైర్యంతో శ్రమించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు విపరీతం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు తగ్గించుకోండి. భేషజాలకు పోవద్దు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు.
